Thu Jan 29 2026 07:17:47 GMT+0000 (Coordinated Universal Time)
కాసు మహేష్ రెడ్డి నిరసన దీక్ష
గురజాల వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నిరసన దీక్షకు దిగారు

అధికార పార్టీ ఎమ్మెల్యే నిరసన దీక్షకు దిగారు. గురజాల వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నిరసన దీక్షకు దిగారు. పిడుగురాళ్ల బైపాస్ రోడ్ నిర్మాణంలో కాంట్రాక్ట్ సంస్థ నిర్లక్ష్యంపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. రహదారి తక్షణం పూర్తి చేయాలని కోరుతూ ఆయన ఆందోళనకు దిగుతున్నారు.
రహదారి నిర్మాణంలో...
గురజాల వైసీపీ ఆధ్వర్యంలో తుమ్మలచెరువు టోల్ ప్లాజా వద్ద నేటి నుండి నిరసనలు దీక్ష లు జరుగుతాయని తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆందోళనకు పిలుపునివ్వటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉదయం పది గంటల నుండి టోల్ గేట్ వద్ద బైపాస్ నిర్మాణం పూర్తి చేయాలంటూ నిరసన దీక్ష లో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పాల్గొన్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేవారు.
Next Story

