Fri Dec 05 2025 09:27:34 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : గృహనిర్భంధంలో గురజాల వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి
గురజాల సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు

గురజాల సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. కాసు మహేష్ రెడ్డిని ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. గురజాల నియోజకవర్గంతో పాటు పల్నాడు ప్రాంతంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఎన్నికల అనంతరం ఘర్షణలు జరుగుతున్నాయి.
నరసరావుపేటలో...
ఇప్పటికే పోలీసులు అదనపు బలగాలను దించి పరిస్థితిని అదుపులోకి తెస్తున్నారు. నరసారావుపేటలో ఉన్న కాసు మహేష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన బయటకు వస్తే అల్లర్లు మరింత పెరుగవుతాయని భావించి టీడీపీ, వైసీపీ నేతలను ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నామని, ముగ్గురికి మించి గుమి కూడి ఉంటే అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు.
Next Story

