Thu Feb 26 2026 15:29:24 GMT+0530 (India Standard Time)
ఐపీఎస్ సునీల్ నాయక్ కు నాన్ బెయిలబుల్ వారెంట్
సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ కు గుంటూరు మొబైల్ న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది

సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ కు గుంటూరు మొబైల్ న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇటీవల సునీల్ నాయక్ ను అరెస్ట్ చేసేందుకు బీహార్ వెళ్లిన పోలీసులకు అక్కడి న్యాయస్థానం నుంచి చుక్కెదురయింది. ట్రాన్సిట్ వారెంట్ జారీ చసేందుకు పాట్నా హైకోర్టు నిరాకరించింది. దీంతో పోలీసులు గుంటూరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
కస్టోడియల్ టార్చర్ కేసులో...
డిప్యూటీ స్పీకర్ రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేస్తారన్న నేపథ్యంలో ఏపీ హైకోర్టును ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆశ్రయించారు. ఆయనపై నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. సునీల్ ముందస్తుబెయిల్పై విచారించనున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేడు నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది.
Next Story

