Tue Jan 20 2026 09:56:32 GMT+0000 (Coordinated Universal Time)
ఒక నిమిషం ఆలస్యమైనా..?
ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ - 1పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఒక్క నిమిషం ఆలస్యమయినా లోపలకి అనుమతించరు.

ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ - 1పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఒక్క నిమిషం ఆలస్యమయినా లోపలకి అనుమతించరు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జరుగుతుననాయి. ఇందుకు ఏపీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 297 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.
లక్షల సంఖ్యలో...
ఈ పరీక్షలకు మొత్తం 1,26,449 మంది అభ్యర్థులు హాజరవుతున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఉదయం పది గంటల నుంచి 12 గంటల వరకూ పేపర్ 1, మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకూ పేపర్ 2ను నిర్వహించనున్నారు. అభ్యర్థులు హాల్ టిక్కెట్ తో పాటు గుర్తింపు కార్డును కూడా చూపాలి. 9 గంటలకల్లా పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుందని తెలిపారు. 9 నుంచి 9.30 గంటల వరకు మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమయినా అనుమతించరు. మధ్యాహ్నం పరీక్షకు ఒంటి గంట నుంచి 1.30 గంటలలోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.
Next Story

