Thu Dec 11 2025 04:18:46 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభుత్వ పనితీరు భేష్
సంక్షేమ పథకాలన్నీ లబ్దిదారులకు నేరుగా అందుతున్నాయని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు

సంక్షేమ పథకాలన్నీ లబ్దిదారులకు నేరుగా అందుతున్నాయని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో గవర్నర్ పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం గౌరవ వందనాన్ని స్వీకరించారు. వివిధ ప్రభుత్వ పథకాలు, శాకలకు సంబంధించిన శకటాలను పరిశీలించారు. సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు.
సంక్షేమ పథకాలన్నీ...
అనంతరం గవర్నర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు నేరుగా లబ్దిదారులకు అందడం మంచి పరిణామమన్నారు. విద్య, వైద్య రంగాల పై ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ ప్రశంసనీయమని గవర్నర్ అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లగలిగారని గవర్నర్ ప్రశంసించారు.నాణ్యమైన విద్య, వైద్యం అందిన చోట రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ తో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Next Story

