Wed Dec 10 2025 14:01:03 GMT+0000 (Coordinated Universal Time)
ఉద్యోగులకు మరోసారి షాక్.. మూడు రాజధానులేవీ?
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు 23 శాతం ఫిట్ మెంట్ ఇచ్చినట్లు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు 23 శాతం ఫిట్ మెంట్ ఇచ్చినట్లు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. ఉద్యోగులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో గవర్నర్ ఈ ప్రకటన చేయడం విశేషం. కొత్త పీఆర్సీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ చేత ప్రభుత్వం మరోసారి చెప్పించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు ఉగాది నాటికి ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయని, అందులో రెండు గిరిజన జిల్లాలున్నాయని విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు.
ప్రతిసారీ....
ప్రతి సారి మూడు రాజధానుల అంశాన్ని గవర్నర్ ప్రసంగంలో ఉంటుంది. అయితే ఈసారి మూడు రాజధానుల ప్రస్తావన మాత్రం లేదు. ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకోవడంతో ఈసారి గవర్నర్ నోటి నుంచి మూడు రాజధానుల అంశం రాలేదు. గవర్నర్ విశ్వభూషణ హరిచందన్ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగించారు.
Next Story

