Sun Mar 22 2026 22:38:52 GMT+0530 (India Standard Time)
మూవీ టిక్కెట్ల పై ఏపీ సర్కార్?
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల ధరల నిర్ణయంపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించనుంది.

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల ధరల నిర్ణయంపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించనుంది. ఈరోజు ప్రభుత్వం అప్పీల్ చేసే అవకాశముంది. ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలను నిర్ణయించడం యాజమాన్యాల ఇష్టమని కోర్టు తీర్పు చెప్పింది. జీవో నెంబరు 35ను కొట్టివేసింది.
నేడు డివిజన్ బెంచ్ కు...
సినిమా టిక్కెట్ల ధరలు అందరికీ అందుబాటులో ఉండాలని జగన్ ప్రభుత్వం జీవో నెంబరు 35ను తెచ్చింది. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా థియేటర్ల యాజమాన్యానికి అనుకూలంగా కోర్టు తీర్పు చెప్పింది. అయితే దీనిపై డివిజన్ బెంచ్ కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు పిటీషన్ వేసే అవకాశముంది.
Next Story

