Sun Dec 14 2025 00:24:20 GMT+0000 (Coordinated Universal Time)
Sadaram : దివ్యాంగులు మోసపోవద్దు.. ప్రభుత్వం హెచ్చరికలు
Sadaram : దివ్యాంగులు మోసపోవద్దు.. ప్రభుత్వం హెచ్చరికలు

సదరం స్లాట్ బుకింగుల విషయంలో దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు దళారులను ఎవరినీ నమ్మవద్దని ప్రభుత్వం దివ్యాoగులకు విజ్ఞప్తి చేసింది. సదరం ద్వారా దివ్యాంగులకు వైకల్య దృవీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో నవంబర్ 14, 2025న రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31,050 స్లాట్లు విడుదల చేశారు. మొత్తం స్లాట్లు రెండు రోజుల్లో బుక్ అయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 118 ఆస్పత్రుల్లో వైకల్య నిర్ధారణ క్యాంపులు నిర్వహిస్తున్నారు. కొందరు దళారులు "ఇతర జిల్లాల్లో స్లాట్ బుక్ చేసి, తర్వాత అనంతపురం జిల్లాకు ట్రాన్స్ఫర్ చేస్తామని నమ్మ బలికి ఒక్కొక్కరి నుంచి 5,000 నుంచి రూ.10,000 వరకు డిమాండ్ చేస్తూ దివ్యాంగులను మోసం చేస్తున్నట్టు వార్తలొస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ పిలుపు ఇచ్చింది.
అప్రమత్తంగా లేకపోతేతే...
దివ్యాంగులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కోరుతుంది. స్లాట్ బుకింగ్, ట్రాన్స్ఫర్ కోసం దళారుల్ని ఎట్టి పరిస్థుల్లోనూ నమ్మవద్దని కోరింతి. దళారులు ద్వారా బుక్ చేసినా, డబ్బులిచ్చినా మీ స్లాట్ ట్రాన్స్ ఫర్ జరగదు. అలాంటి వాటిని తక్షణమే రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. దళారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు స్పష్టం చేశారు. స్లాట్ బుక్ చేసి ట్రాన్స ఫర్ చేసుకోవాలంటే "PGRS పోర్టల్ లో (https:// pgrs. ap. gov. in) రిక్వెష్ట్ పెట్టుకోవాలని ప్రభుత్వం సూచించింది. దళారులను నమ్మి మోసిపోవద్దని, ఎవరూ స్లాట్ బుక్సింగ్స్ ను ట్రాన్స్ ఫర్ చేయకుండా కట్టుదిట్టమైన చరర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇలా చేయండి...
ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరిగే "గ్రీవెన్స్ డే" లోనూ, డిసిహెచ్ఎంయస్ కార్యాలయంలోనూ రాతపూర్వక అభ్యర్ధన ఇవ్వాల్సి ఉంటుంది. . ప్రస్తుతం స్లాట్ బుక్ అయిన ఆస్పత్రి నుంచి అధికారిక మెయిల్ ద్వారా రిక్వెస్ట్ పెట్టుకోవాలి. వీటిలో ఏదో ఒక విధంగా అభ్యర్ధన పెట్టుకుంటే 100 శాతం మీరు కోరిన ఆస్పత్రికి స్లాట్ ట్రాన్స్ఫర్ ఉచితంగా జరుగుతుంది" అని అధికారులు తెలిపారు.అంతే తప్ప దళారులను ఆశ్రయించడంతో పాటు వారికి డబ్బులు ఇచ్చినంత మాత్రాన ఎట్టి పరిస్థితుల్లో స్లాట్ బుక్సింగ్స్ ట్రాన్స్ ఫర్ జరగదని తెలిపింది. దివ్యాంగులు అనవసరంగా దళారులను నమ్మి మోసపోవద్దని, వారిని నమ్మితే సర్టిఫికేట్లు రావని గుర్తుంచుకోవాలని సూచించింది.
Next Story

