Mon Feb 02 2026 00:42:00 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ శాఖల్లో ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఇందులో భాగంగా రెవెన్యూ, దేవాదాయశాఖ లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
730 పోస్టులు.....
రెవెన్యూ శాఖలో 670 పోస్టులు, దేవాదాయ శాఖలో 60 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 730 ఉద్యోగాలను భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. రేపటి నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకూ దరఖాస్తులను స్వీకరిస్తారు. వివరాల కోసం ఉద్యోగార్థులు ఏపీపీఎస్సీ వెబ్ సైట్ లో చూసుకోవాలని అధికారులు కోరారు.
- Tags
- jobs
- notification
Next Story

