Sat Dec 13 2025 19:30:30 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకూ పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు లక్షల సంఖ్యలో విద్యార్థులు హాజరవుతున్నందున వారు ముందు నుంచి ప్రిపేర్ అయ్యేందుకు వీలుగా షెడ్యూల్ ను ప్రకటించినట్లు ఏపీ విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఉదయం 9.30 గంటల నంచి పరీక్షలు ప్రారంభమయి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ జరుగుతాయి.ఏపీ విద్యార్ధులకు బీ అలెర్ట్.! 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. 2026 మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 9.30 నుంచి పరీక్షలు మొదలవుతాయి. రోజులు, తేదీల వారీగా షెడ్యూల్ ఇలా ఉంది.
ఏప్రిల్ ఒకటో తేదీ వరకూ...
మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజీ, మార్చి 18న ఫస్ట్ లాంగ్వేజీ పేపర్ -1 కంపోజిట్ కోర్టు, మార్చి 20వ తేదీన సెకండ్ లాంగ్వేజీ, మార్చి 23వ తేదీన ఇంగ్లీష్ పరీక్ష జరగుతుంది. మార్చి 25వ తేదీన మ్యాథ్స్ పరీక్ష, మార్చి 28వ తేదీన ఫిజికల్ సైన్స్, మార్చి 30వ తేదీన బయోలాజికల్ సైన్స్, ఏప్రిల్ 1వ తేదీన సోషల్ స్టడీస్, మార్చి 31వ తేదీన ఫస్ట్ లాంగ్వేజీ పేపర్ -II కాంపోజిట్ కోర్స్, ఏప్రిల్ ఒకటో తేదీన ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజీ పేపర్ - I న జరుగుతుంది. ఈ పరీక్షలకు విద్యార్థులు ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలని కోరింది.
Next Story

