Fri Dec 05 2025 22:05:24 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : చివరి అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతున్న జగన్ సర్కార్
అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నెల చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో సమావేశాలను నిర్వహించనున్నారు.

చివరి అసెంబ్లీ సమావేశాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నెల చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో సమావేశాలను నిర్వహించనున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్దమవుతుందని సమాచారం అందుతుంది. ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ సమావేశాలు కీలకంగా మారనున్నాయి.
ఐదురోజుల పాటు...
ఈ సమావేశాలను ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారని తెలుస్తోంది. నోటిఫికేషన్ విడుదలయ్యే ముందే బడ్జెట్ ను ప్రవేశపెట్టి కొత్త పథకాలను ప్రజలకు అందించాలన్న లక్ష్యం ప్రభుత్వంలో కనిపిస్తుంది. ఇందుకోసం ఏపీ సర్కార్ కసరత్తులు ప్రారంభించింది. కొత్త పథకాలతో పాటు మరికొన్ని నూతన హామీలను కూడా ఈ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం వెల్లడించే అవకాశముంది.
Next Story

