Sat Dec 13 2025 22:32:20 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Prdesh : చెవిరెడ్డి ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతి
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులను జప్తు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులను జప్తు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం కుంభకోణం ద్వారా దాదాపు అరవై కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు కూడబెట్టారని స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం అధికారులు తేల్చారు.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో...
దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తుల జప్తునకు అనుమతించాలని ప్రభుత్వాన్ని సిట్ కోరింది. ఇందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కొన్ని నెలలుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో చెవిరెడ్డి ఆస్తులను సిట్ అధికారులు జప్తు చేయనున్నారు.
Next Story

