Sun Feb 22 2026 19:14:04 GMT+0530 (India Standard Time)
ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సస్పెన్షన్ పొడిగింపు..పదవీ విరమణ వరకూ
ఐపీఎస్ అధికారి పి.వి. సునీల్ కుమార్ సస్పెన్షన్ను పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది

1993 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి పి.వి. సునీల్ కుమార్ సస్పెన్షన్ను పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్, 1969లోని రూల్ 3(3) ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. క్రిమినల్ కేసు పూర్తయ్యే వరకు లేదా ఆయన పదవీ విరమణ తేదీ అయిన 30 జూన్ 2026 వరకు ఈ సస్పెన్షన్ అమలులో ఉండడనుంది.
కేసుల దర్యాప్తు నేపథ్యంలో
ఈ రెండింటిలో ఏది ముందుగా వస్తే ఆ వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ కేసు ఆయన సర్వీస్ హోదాతో సంబంధం ఉండటంతో సస్పెన్షన్ను పొడిగించినట్లు ప్రభుత్వం పేర్కొంది. దీంతో సునీల్ కుమార్ సస్పెన్షన్ లో ఉండి పదవీ విరమణ చేయాల్సి వస్తుంది.
Next Story

