Mon Dec 08 2025 06:06:44 GMT+0000 (Coordinated Universal Time)
మూడు వేల కోట్ల నిధుల విడుదల
ఏపీ ప్రభుత్వం గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ఇరవై లక్షల మంజూరు చేసింది. గ్రామ సచివాలయాలకు నిధులను మంజూరు చేసింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ఇరవై లక్షల మంజూరు చేసింది. గ్రామ సచివాలయాలకు ఈ నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో గ్రామాలలో నెలకొన్న అత్యవసర సమస్యలను పరిష్కరించడానికి వినియోగించనున్నారు. ఈ మేరకు మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించింది.
గడప గడపకు మన ప్రభుత్వం....
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజా సమస్యలు అనేకం వెలుగులోకి వచ్చాయి. వైసీపీ ఎమ్మెల్యేల నుంచి కూడా పార్టీ నాయకత్వానికి సమస్యల గురించి వినతులు అందాయి. దీంతో ముఖ్యమంత్రి జగన్ నియోజకవర్గానికి రెండు కోట్లు, గ్రామ సచివాలయానికి ఇరవై లక్షలు కేటాయిస్తామని చెప్పారు. చెప్పిన మేరకు ఇరవై లక్షలు మంజూరు చేశారు. రాష్ట్రంలో ఉన్న 15,004 గ్రామ సచివాలయాలకు మూడు వేల కోట్ల రూపాయలను కేటాయించారు.
Next Story

