Fri Dec 12 2025 13:41:37 GMT+0000 (Coordinated Universal Time)
చింతూరు బస్సు ప్రమాదంతో ప్రభుత్వం కీలక నిర్ణయం
చింతూరు బస్సు ప్రమాదంతో ప్రభుత్వం కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది

చింతూరు బస్సు ప్రమాదంతో ప్రభుత్వం కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. చింతూరు బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని హోం మంత్రి అనిత పరిశీలించారు. అధికారులతో మాట్లాడి,వివరాలు అడిగి తెలుకున్న మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఘాట్ రోడ్డులో రాత్రి వేళ ప్రయాణాలు నిలిపి వేస్తామని తెలిపారు. చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేస్తామని వంగలపూడి అనిత తెలిపారు. ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారని అన్నారు.
ప్రమాదానికి గల కారణాలను...
ప్రమాదంపై ఆరా తీసిన హోం మంత్రి అనిత ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బస్ డ్రైవర్ అతి వేగం ప్రమాదానికి కారణమని వంగలపూడి అనిత అన్నారు. గాయపడిన వారికి మెరుగు అయిన చికిత్స అందిస్తామన్న వంగలపూడి అనిత మృతి చెందిన వారికి ప్రభుత్వం తరపున ఎక్స్ గ్రేషియా అందిస్తామని తెలిపారు. రాత్రివేళ ఘాట్ రోడ్డులో ప్రయాణాలను అనుమతించవద్దని అధికారులను ఆదేశించారు.
Next Story

