Fri Dec 05 2025 09:07:40 GMT+0000 (Coordinated Universal Time)
సుబ్రహ్యణం కుటుంబానికి పరిహారం ఇచ్చిన చంద్రబాబు
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ హత్య కేసుకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ హత్య కేసుకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాము ముందు చెప్పినట్లుగా అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఈ మేరకు హతుడు సుబ్రహ్యణ్యం తల్లిదండ్రుల ఖాతాల్లో పరిహారాన్ని జమ చేసింది. గతంలో హామీ ఇచ్చినట్లుగానే వారికి పింఛను మంజూరు చేసింది.
బకాయీఉన్న..
ఇప్పటి వరకూ బకాయీ ఉన్న 1,20,438 రూపాయలను వారి ఖాతాల్లో జమ చేసింది. అలాగే ఎస్సీ, ఎస్టీ ఛార్జిషీటు పరిహారం కింద 2.06 వేల రూపాయల పరిహారం కూడా ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన కారు డ్రైవర్ ను హత్య చేసి ఇంటికి తెచ్చిన ఘటన సంచలనం సృష్టించింది. అనంతబాబు బెయిల్ ను రద్దు చేయాలని సుబ్రహ్యణ్యం తల్లిదండ్రులు ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Next Story

