Thu Mar 19 2026 11:16:43 GMT+0530 (India Standard Time)
ఏపీ సీఎంవోలోకి యువ ఐఏఎస్
ఆంధ్రప్రదేశ్ లో పలువరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది

ఆంధ్రప్రదేశ్ లో పలువరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కార్యాలయంలోకి యువ ఐఏఎస్ అధికారి భరత్ గుప్తా నియమితులయ్యారు. సీఎంవో జాయింట్ సెక్రటరీగా నియమించారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ గా లక్ష్మీ షాను ప్రభుత్వం నియమించింది.
ఏపీఐఐసీ ఎండీగా...
ఏపీఐసీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా మరో యువ ఐఏఎస్ అధికారి సృజనకు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. కార్మిక శాఖ కమిషనర్ గా ఎంఎం నాయక్ కు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరికొందరు ఐఏఎస్ లకు స్థానచలనం కలిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
Next Story

