Sat Mar 21 2026 09:34:36 GMT+0530 (India Standard Time)
Ys Jagan : అసెంబ్లీ ప్రాంగణంలోకి వైఎస్ జగన్ వాహనం.. అనుమతించిన ప్రభుత్వం
వైసీపీ అధినేత జగన్ వాహనాన్ని అసెంబ్లీ లోపలికి అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

వైసీపీ అధినేత జగన్ వాహనాన్ని అసెంబ్లీ లోపలికి అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జగన్ కు ప్రతిపక్ష హోదా లేకపోయినా అనుమతించాలని డిసైడ్ చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా జగన్ వాహనాన్ని అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.
వైసీపీ విజ్ఞప్తి మేరకు...
వైసీపీ శాసనసభ పక్షం ఈ మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. జగన్ వాహనాన్ని నేరుగా అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించాలని కోరింది. ఇందుకు సానుకూలంగా ప్రభుత్వం స్పందించింది. ఎమ్మెల్యేలు నాలుగో నెంబరు గేటు దగ్గర బయటకు దిగి అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీలోకి వెళ్లాలని సూచించింది.
Next Story

