Tue Mar 17 2026 23:45:11 GMT+0530 (India Standard Time)
మోదీ పర్యటన.. ఏపీలో పాఠశాలల ప్రారంభ తేదీ వాయిదా
ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలల ప్రారంభ తేదీని ప్రభుత్వం వాయిదా వేసింది.

ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలల ప్రారంభ తేదీని ప్రభుత్వం వాయిదా వేసింది. మే 6వ తేదీ నుంచి జులై 4వ తేదీ వరకూ ఏపీలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పరీక్షలు, మూల్యాంకనం కొంత ఆలస్యం అయినందున వేసవి సెలవులను కూడా జులై నాల్గవ తేదీ వరకూ ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది.
ఒకరోజు తర్వాత....
అయితే జులై 4 వ తేదీన కాకుండా 5వ తేదీన పాఠశాలలు ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. జులై 4వ తేదీన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకలో పర్యటిస్తున్నారు. విశాఖ, నరసాపురం లో జరిగే కార్యక్రమాల్లో మోదీ పాల్గొంటారు. దీంతో మోదీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో పాఠశాలలను జులై 4వ తేదీన కాకుండ 5వ తేదీన ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
Next Story

