Fri Dec 05 2025 11:57:32 GMT+0000 (Coordinated Universal Time)
నేపాల్ లో చిక్కుకున్న ఏపీకి చెందిన పన్నెండు మందిని
నేపాల్ లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారిని భారత్ కు రప్పించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది

నేపాల్ లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారిని భారత్ కు రప్పించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మంత్రి నారా లోకేష్ ప్రత్యేక ఆదేశాలతో అధికారులు శ్రీలంకలోని సిమి కోట్ లో చిక్కుకున్న 12 మందిని ప్రత్యేక విమానంలో ఉత్తరప్రదేశ్ బోర్డర్ సమీపంలో ఉన్న నేపాల్ గంజ్ ఎయిర్ పోర్ట్ కు తరలించననున్నారు. ఉత్తర్ ప్రదేశ్ సరిహద్దు నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో పన్నెండు మంది ఏపీకి చెందిన వారు లక్నో చేరుకోనున్నారు.
లక్నోకు తీసుకు వచ్చి...
లక్నో నుండి హైదరాబాద్ పన్నెండు మందిని విమానంలో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లును అధికారులు చేస్తున్నారు. ఖాట్మండు సమీపంలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి అధికారులతో సమన్వయం చేసి మంత్రి నారా లోకేష్ ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. నేపాల్ లో చిక్కుకున్న వారు రాష్ట్రానికి సురక్షితంగా తిరిగివచ్చి ఇళ్ళకి చేరే వరకూ సంబంధిత అధికారులు అంతా అలెర్ట్ గా ఉండాలని మంత్రి నారా లోకేష్ అధికారులకుఆదేశాలు జారీ చేశారు.
Next Story

