Sun Mar 15 2026 21:41:18 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : ఈరోజు వేడుకలకు దూరంగా ఉండాలి.. ఏపీ సర్కార్ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ లో నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది

ఆంధ్రప్రదేశ్ లో నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో దేశమంతా ఏడు రోజులు పాటు సంతాపదినాలు జరుగుతున్నందున అధికారికంగా ఎవరూ న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే సాధారణంగా అధికారులు కలుసుకుని శుభాకాంక్షలు చెప్పుకోవచ్చని తెలిపింది.
ఎప్పటిలాగానే...
కొత్త ఏడాది జనవరి ఒకటో తేదీన ఉన్నతాధికారులను కలిసి కేక్ లను కట్ చేయడం సంప్రదాయంగా వస్తుంది. అయితే ఈసారి అలాంటి వేడుకలకు దూరంగా ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నతాధికారులు నుంచి అందరూ సాధారణ దినాల్లాగానే విధులకు హాజరు కావాలని కోరింది. దీనిపై ఎలాంటి సందేహాలున్నా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ తో పాటు బ్లూబుక్ చూసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

