Fri Dec 05 2025 22:05:16 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్డీవో ఆఫీస్ లపై ప్రభుత్వం కీలక నిర్ణయం
రెవెన్యూ డివిజన్లలో డివిజనల్ డెవలెప్ మెంట్ ఆఫీసులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రెవెన్యూ డివిజన్లలో డివిజనల్ డెవలెప్ మెంట్ ఆఫీసులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో రెవిన్యూ డివిజన్లలో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసులు ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని కార్యాలయాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
డీడీఓ కార్యాలయాలుగా...
ఇప్పటికే డివిజన్లలో ఉన్న అన్ని పంచాయతీ అభివృద్ధి శాఖలు, డివిజనల్ పంచాయతీ అధికారి కార్యాలయం, డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయాలు.. కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఈ డిడిఓ కార్యాలయాలకు మార్చాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు కార్యాలయాల ఏర్పాటుకు ఫర్నిచర్ ఇతర సదుపాయాలు కల్పించాలని, అందుబాటులో ఉన్న నిధులతో ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లా పరిషత్ సీఈఓ లకు ఆదేశాలు జారీ చేశారు.
Next Story

