Fri Dec 05 2025 08:44:30 GMT+0000 (Coordinated Universal Time)
ప్రధాని పర్యటన బాధ్యతలు సీనియర్ ఐపీఎస్, ఐఏఎస్ లకు
ప్రధాని మోదీ అమరావతి పర్యటన దృష్ట్యా అధికారులకు విధులు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది

ప్రధాని మోదీ అమరావతి పర్యటన దృష్ట్యా అధికారులకు విధులు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 31 మంది ఐఏఎస్, ఐపీఎస్ లకు ప్రధాని పర్యటన బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర స్థాయి నోడల్ అధికారిగా జి.వీరపాండియన్ కు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. వచ్చే నెల రెండో తేదీన సాయంత్రం నాలుగు గంటలకు రాజధాని అమరావతి పనులకు ప్రారంభోత్సవం చేయడానికి ప్రధాని మోదీ రానున్నరు.
నోడల్ అధికారిగా...
ఈ సందర్భంగా ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు సీనియర్ అధికారులకు బాధ్యతలను అప్పగించింది. పీఎంవో, ఎస్పీజీ, సీఎంవోతో సమన్వయం చేసుకోవాలని ఆదేశం వీరపాండియన్ కు ఆదేశాలు జారీ చేసింది. శాంతిభద్రతల అదనపు డీజీ మధుసూదన్ రెడ్డికి సమన్వయ బాధ్యతలను అప్పగించింది. ప్రధాని రోడ్, బహిరంగ సభ, వీఐపీల బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Next Story

