Sat Mar 07 2026 21:20:27 GMT+0530 (India Standard Time)
మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ లో న్యూ ఇయర్ వేడుకలకు ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ లో న్యూ ఇయర్ వేడుకలకు ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దుకాణాలు, బార్ల వేళలను మార్పులు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ఈ వేళలు ఈరోజు వరకే అమలులో ఉంటాయిని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
వేళలు పొడిగింపు....
ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాలు రాత్రి 9 గంటల వరకే పనిచేస్తాయి. ఈరోజు మాత్రం మరో గంట అదనంగా అనుమతి ఇచ్చారు. వైన్ షాపులు ఈరోజు రాత్రి 10 గంటల వరకూ పనిచేస్తాయి. బార్లు మామూలు రోజుల్లో 11 గంటల వరకూ ఉంటాయి. ఈరోజు 12 గంటల వరకూ తెరుచుకునే వీలు కల్పించారు. ఇక పబ్ లు, పర్యాటక ప్రాంతాల్లోని హోటళ్లలో మద్యం విక్రయాలకు కూడా ఇదే సమయాన్ని వర్తింప చేశారు.
Next Story

