Thu Mar 19 2026 09:27:25 GMT+0530 (India Standard Time)
సంఘాన్ని ఎందుకు రద్దు చేయకూడదు?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా సమాధానమివ్వాలని పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా సమాధానమివ్వాలని పేర్కొంది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. వారం రోజుల లోపు దీనిపై సమగ్ర వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
గవర్నర్ ను కలవడంపై....
సూర్యనారాయణ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఇటీవల గవర్నర్ ను కలిసిన సంగతి తెలిసిందే. తమ జీతాలు, ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో అందడం లేదని గవర్నర్ కు ఈ సంఘం ఫిర్యాదు చేసింది. సమస్యలపై ప్రభుత్వాన్ని సంప్రదించే ప్రత్యామ్నాయ మార్గాలున్నప్పటికీ గవర్నర్ ను కలవడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. గవర్నర్ను ఎందుకు సంప్రదించాలి వచ్చిందో తెలపాలని పేర్కొంది.
Next Story

