Sun Feb 01 2026 21:54:47 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ మరో నోటిఫికేషన్ రెడీ
నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కస్తూర్బా గాంధీ బాలిక స్కూళ్లో పోస్టులకు దరఖాస్తులను కోరింది.

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. కేజీబీవీల్లో 729 పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 7వ తేదీ నుంచి 15వ తేదీ లోపు జరుగుతందని అధికారులు తెలిపారు. ఏపీలో సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 729 బోధనేతర పోస్టులను పొరుగుసేవల ద్వారా భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్పీడీ శ్రీనివాసరావు పేర్కొన్నారు.
అర్హులైన వారు...
అర్హులైనవారు ఈనెల 7 నుంచి 15లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన అభ్యర్థులను కోరారు. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులను మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా టైప్-3 కేజీబీవీల్లో 547, టైప్-4లో 182పోస్టులును భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఉద్యోగాల భర్తని వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో నోటిఫికేషన్ రెడీ అయింది.
Next Story

