Sun Mar 08 2026 05:52:27 GMT+0530 (India Standard Time)
ఏపీలో పదో తరగతి రిజల్ట్ ఎప్పుడంటే?
పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్షల ఫలితాలను మే రెండో వారంలో విడుదల చేయనుంది

పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్షల ఫలితాలను మే రెండో వారంలో విడుదల చేసేందుకు అంతా సిద్ధం చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి తెలిపారు. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు 18వ తేదీ వరకూ జరగనున్నాయి.
మే రెండో వారంలో...
ఈ నెల 19వ తేదీ నుంచే ఆన్సర్ పేపర్లను దిద్దే కార్యక్రమం ప్రారంభం కానుంది. 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకూ పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తవ్వాలని విద్యాశాఖ ఇప్పటికే ఆదేశించింది. మే రెండో వారంలో ఫలితాలను విడుదల చేసేందుకు ప్రణాళికను రూపొందించారు.
Next Story

