Sat Jan 31 2026 20:38:49 GMT+0000 (Coordinated Universal Time)
అమరావతి రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
రాజధాని అమరావతి రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

రాజధాని అమరావతి రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 11వ ఏడాది కౌలును విడుదల చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. .163.67 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసింది. 18,726మంది రైతులకు వారి ఖాతాల్లో కౌలు నగదు జమ అయినట్లు సీఆర్డీఏ అధికారులు వెల్లడించారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు కౌలు మొత్తం విడుదల చేసింది.
నగదు జమ కాని వారు...
అయితే ఎనభై ఎనిమిది మంది రైతులకు సాంకేతిక కారణాలతో కౌలు నగదు వారి ఖాతాల్లో జమ కాలేదని సీఆర్డీఏ అధికారులు తెలిపారు. కౌలు మొత్తం జమకాని రైతులు బ్యాంకు వివరాలు అందజేయాలని సీఆర్డీఏ అధికారులు కోరారు. సాంకేతిక కారణాలను విశ్లేషించిన తర్వాత కౌలు మొత్తాన్ని జమ చేస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ తమకు కౌలు మొత్తం చెల్లించకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేయడంతో వెంటనే ప్రభుత్వం కౌలు మొత్తాన్ని విడుదల
చేసింది.
Next Story

