Sun Mar 29 2026 19:37:25 GMT+0530 (India Standard Time)
నేడు కర్నూలులో విద్యాసంస్థలకు సెలవు
నేడు కర్నూలు నగరంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది

నేడు కర్నూలు నగరంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నిమజ్జనం సందర్భంగా కర్నూలులో సెలవు ప్రకటించారు.కర్నూలులో గణేశుడి శోభాయాత్ర ప్రారంభం కానుండటంతో నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. నిమజ్జనం సందర్భంగా రెండు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్నూలు ఓల్డ్ సిటీలోని రాంబొట్ల ఆలయం వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
గణేశుడి నిమజ్జనం సందర్భంగా...
వినాయకుడికి పూజల అనంతరం లడ్డూ వేలంపాట నిర్వహణ.. కర్నూలు రాంబొట్ల ఆలయం నుంచి మొదటి శోభాయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3 గంటల నుండి నిమజ్జనం ప్రారంభం కానుంది. నిమజ్జనానికి వినాయక ఘాట్లో ఏడు క్రేన్లను ఏర్పాటు చేశారు. స్టాంటన్ పురంలో రెండు క్రేన్లు ఏర్పాటు చేసిన అధికారులు నిమజ్జనం సందర్భంగా వాహనాల దారి మళ్లించారు. రాజ్ విహార్ నుంచి కలెక్టరేట్ వైపు వెళ్లే వాహనాలు దారి మళ్లిస్తారు. కలెక్టరేట్, సీ క్యాంప్ మార్గంలో వాహన రాకపోకలపై నిషిద్ధం ప్రకటించారు.
Next Story

