Thu Mar 19 2026 10:28:13 GMT+0530 (India Standard Time)
సోంపేటలో కార్గో ఎయిర్ పోర్టు
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో కార్గో ఎయిర్ పోర్టును ఏర్పాటు చేయాని ప్రభుత్వం నిర్ణయించింది.

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో కార్గో ఎయిర్ పోర్టును ఏర్పాటు చేయాని ప్రభుత్వం నిర్ణయించింది. కార్గో ఎయిర్ పోర్టు నిర్మాణం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.ఇప్పటి వరకు పలాస లో అనుకున్న ఎయిర్ పోర్ట్కు అక్కడ రైతాంగం భూములు ఇవ్వటానికి నిరాకరిస్తూ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయంలో పలాస నుంచి సోంపేటకు మనసు మార్చింది.
వెయ్యిఎకరాల భూసేకరణ...
ఇందుకు అవసరమైన వెయ్యి ఎకరాలు భూమి సేకరణ కోసం అధికారులు బారువా, లక్కవరం, కొర్లం, పలాసపురం గ్రామాల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ భూములను పరిశీలిస్తోంది. కార్గో ఎయర్ పోర్టు ఏర్పాటయితే స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతుంది. అయితే ఈ గ్రామాల్లో రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరిస్తారా? లేదా? అన్నది చూడాలి.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

