Fri Dec 05 2025 16:14:19 GMT+0000 (Coordinated Universal Time)
అమరావతిలో అతి పెద్ద ఎన్టీఆర్ విగ్రహం
గుజరాత్ లో ఏర్పాటు చేసిన సర్దార్ పటేల్ విగ్రహం మాదిరిగా అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది

గుజరాత్ లో ఏర్పాటు చేసిన సర్దార్ పటేల్ విగ్రహం మాదిరిగా అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అతి పెద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇటీవల మున్సిలప్ శాఖ మంత్రి నారాయణ అధికారుల బృందంతో కలసి పటేల్ విగ్రహాన్ని సందర్శించిన వచ్చిన తర్వాత అధికారుల బృందం నివేదిక అందించినట్లు తెలిసింది.
విగ్రహ ఏర్పాటుకు డీపీఆర్...
అయితే ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై డీపీఆర్ తయారీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డీపీఆర్ తయారీకి కన్సల్టెన్సీల నుంచి ప్రతిపాదనలు కోరుతూ ప్రకటన జారీ చేయాలని నిర్ణయించింది. నీరుకొండ వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు నిర్ణయించి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మే 14వ తేదీలోగా ఆర్ఎఫ్పీ సమర్పించాలన్న అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రధాన రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్‌కు డీపీఆర్ రూపొందించాలని నిర్ణయం తీసుకుంది. ఆయా అంశాలపై ఆర్‌ఎఫ్‌పీల సమర్పణకు ప్రకటన విడుదల చేసిన అమరావతి డెవలెప్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story

