Sun Feb 01 2026 08:13:13 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఫిబ్రవరి 5 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల ఐదో తేదీ నుంచి జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల ఐదో తేదీ నుంచి జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. సమావేశాలను మూడు రోజుల పాటు నిర్వహించే అవకాశాలున్నాయి. బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు తేదీలను కూడా ఖరారు చేసినట్లు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
కీలక నిర్ణయాలను...
ఈ సమావేశాల్లోనో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. ఎన్నికలకు ముందు జరిగే, ప్రభుత్వానికి ఇదే చివరి సమావేశాలు కావడంతో కీలక బిల్లులకు కూడా ఆమోదం తెలిపే అవకాశముంది. ముఖ్యమై నిర్ణయాలను, పథకాలను అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించే అవకాశముందని తెలిసింది.
Next Story

