Sat Mar 07 2026 20:44:08 GMT+0530 (India Standard Time)
బెజవాడ అష్టదిగ్భంధనం... నాలుగు వైపులా
ఏపీ ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోవాలని నిర్ణయించింది.

ఏపీ ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి. విజయవాడ నాలుగు వైపుల చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉద్యోగులు ఇతర జిల్లాల నుంచి ఎవరినీ రానివ్వ కుండా గట్టి ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇప్పటికే పీఆర్సీ సాధన సమితి నేతలతో పాటు పలు ఉద్యోగ సంఘాల నేతలకు నోటీసులు ఇచ్చే పనిని మొదలు పెట్టారు.
చలో విజయవాడను....
కొత్త పీఆర్సీని రద్దు చేయాలంటూ ఉద్యోగులు చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపు నిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఉద్యోగులను విజయవాడకు తీసుకు వచ్చి ప్రభుత్వంపై వత్తిడి తేవాలని ఉద్యోగ సంఘాలు భావించాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఈ కార్యక్రమాన్ని విజయవంతం కాకుండా అన్ని చర్యలు ప్రారంభించింది. ఈరాత్రికి ఉద్యోగ సంఘాల నేతలను అరెస్ట్ చేసే అవకాశముంది.
Next Story

