Tue Feb 07 2023 14:11:01 GMT+0000 (Coordinated Universal Time)
ఆప్కో ఛైర్మన్ గా గంజి చిరంజీవి
ఆప్కో ఛైర్మన్ గా గంజి చిరంజీవిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఆప్కో ఛైర్మన్ గా గంజి చిరంజీవిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరి నేత గంజి చిరంజీవి గత ఏడాది ఆగస్టులో పార్టీని వీడి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయన పార్టీలో చేరిన వెంటనే వైసీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా జగన్ నియమించారు.
వైసీపీలో చేరిన తర్వాత....
తాజాా ఆప్కో విభాగం ఛైర్మన్ గా నియమిస్తూ జీవో నెంబరు 8ని ప్రభుత్వం విడుదల చేసింది. కేబినెట్ ర్యాంకు ఉన్న ఈ పదవిలో గంజి చిరంజీవి నియమితులయ్యారు. ఈరోజు జగన్ చేతుల మీదుగా గంజి చిరంజీవి నియామక పత్రాలను అందుకోనున్నారు. ఇప్పటివరకూ ఆప్కో ఛైర్మన్ గా ఉన్న చిల్లపల్లి మోహన్ రావు పదవీకాలం గత నెలతో ముగియడంతో ఆ స్థానంలో గంజి చిరంజీవిని జగన్ నియమించారు.
Next Story