Sun Mar 15 2026 18:21:04 GMT+0530 (India Standard Time)
Holidays : పది రోజులు సంక్రాంతి సెలవులు.. ఉత్వర్వుల విడుదల
ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలకు ఈ నెల 9వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది

ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలకు ఈ నెల 9వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం పది రోజులు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ఈ నెల 9 నుంచి 18వ తేదీ వరకు మొత్తం 10 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి.
సెలవుల్లో తరగతులు...
సంక్రాంతి సెలవుల్లో ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలు తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్ని పాఠశాలల యాజమాన్యాలకు జిల్లా విద్యా శాఖాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సెలవుల అనంతరం 19వ తేదీన పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. ఏపీలో సంక్రాంతి పెద్ద పండగ కావడంతో పది రోజుల పాటు సెలవులను ప్రభుత్వం ఇచ్చింది.
Next Story

