Sun Mar 15 2026 13:27:05 GMT+0530 (India Standard Time)
మృతుల కుటుంబాలకు పది లక్షలు
అనంతపురం జిల్లాలో విద్యుత్తు షాక్ తో మృతి చెందిన ఆరుగురు కూలీల కుటుంబాలకు పది లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది

అనంతపురం జిల్లాలో విద్యుత్తు షాక్ తో మృతి చెందిన ఆరుగురు కూలీల కుటుంబాలకు పది లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కొక్క కుటుంబానికి పది లక్షల రూపాయలు పరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురికి మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఆదుకుంటాం...
దీనిపై ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా స్పందించారు. అనంతపురం జిల్లా బొమ్మన హల్ లో జరిగిన ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. జరిగిన నష్టాన్ని తట్టుకునే ఆ శక్తిని ఆ కుటుంబాలకు ఇవ్వాలని ఆయన భగవంతుడిని ప్రార్థించారు.
Next Story

