Sat Jul 12 2025 13:28:00 GMT+0000 (Coordinated Universal Time)
Annadatha Sukhibhava : రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్.. అర్హత ఉన్నోళ్లు టెన్షన్ పడక్కకర్లేదు
ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అన్నదాత సుఖీశభవ పథకంపై అప్ డేట్ ఇచ్చింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇస్తున్న హామీలను వరసగా అమలు చేస్తుంది. ఇప్పటికే అనేక హామీలను అమలు చేసిన ప్రభుత్వం ఇటీవల అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులను విడుదల చేసింది. తల్లుల ఖాతాల్లో పదమూడు వేల రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి జమ చేసింది. ఇక ఇప్పుడు రైతుల వంతు వచ్చింది. రైతులు ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో అన్నదాత సుఖీభవ పథకాన్ని విడుదల చేయాలని నిర్ణయించింది. పీఎం కిసాన్ పథకం నిధులతో కలిపి విడుదల చేసేలా చర్యలు ప్రారంభించింది. ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలు తీసేస్తే పథ్నాలుగు వేల రూపాయలు విడతల వారీగా అంటే మూడు దఫాల్లో జమ చేయనుంది.
గత ఏడాది జమ కాకపోవడంతో...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదల చేయలేదు. ఖరీప్, రబీ సీజన్ లు గత ఏడాది గడిచిపోయినా నిధులు విడుదల కాలేదన్న అసంతృప్తిలో అన్నదాతలకు ఊరట కల్గించేలా నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి సంబంధించి అర్హులైన లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయింది. పీఎం కిసాన్ నిధులు ఈ వారంలోనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. దీంతో పాటు నాలుగు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాలని నిర్ణయించింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నాలుగు వేల రూపాయలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెండు వేల రూపాయలు కలిపి మొత్తం ఆరు వేల రూపాయలు అన్నదాతల ఖాతాలో జమ కానున్నాయి.
అర్హులైన వారిని గుర్తించి...
వ్యవసాయ శాఖ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన లబ్దిదారుల జాబితా సిద్ధమయినట్లు తెలిసింది. మొత్తం 46 లక్షల మందికి అన్నదాత సుఖీభవ పథకం వర్తించనుందని తెలిసింది. వారిని ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ కేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పింది. అయితే కేవైసీ పూర్తి కాకుంటే నిధులు జమ చేయలేమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ అర్హులైన వారందరికీ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అర్హత ఉండి అన్నదాత పథకం అందకపోతే గ్రామ, వార్డు సచివాలయం ద్వారా ఫిర్యాదు చేయడానికి కొంత సమయం ఇచ్చే అవకాశముందని కూడా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తల్లికి వందనం పథకం తరహాలోనే అర్హులైన అందరికీ ఇవ్వాలని నిర్ణయించిన చంద్రబాబు అర్హులైన వారు ఫిర్యాదుకు నిధులు విడుదలయిన తేదీ తర్వాత కొంత సమయం ఇవ్వాలని నిర్ణయించారు.
Next Story