Thu Dec 18 2025 10:02:37 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : రైతులకు తీపికబురు... వారి ఖాతాల్లో లక్ష రూపాయల నగదు జమ
ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రధానంగా కౌలు రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. కౌలు రైతులకు లక్ష రూపాయల వరకూ పంట రుణం అందించాలని నిర్ణయించింది. కౌలు చేసుకునే రైతులకు మాత్రమే ఈ లక్ష రూపాయల పంట రుణం లభిస్తుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌలు రైతులకు పంట రుణాలపై కీలక నిర్ణయం తీసుకుంది. కౌలు రైతులు సాగు చేసుకునేందుకు రుణాలు ఇవ్వాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పాలకవర్గాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల ద్వారా...
జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల ద్వారానే కౌలు రైతులకు లక్ష రూపాయల రుణాన్ని మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కౌలు రైతుల పడే ఇబ్బందులను చూసిన కూటమి ప్రభుత్వం వారిని ఆదుకునే దిశగా ఈ చర్యలను ప్రారంభించింది. అయితే కౌలు రైతులు ఎవరన్నది గుర్తించే పనిని వ్యవసాయ శాఖ అధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. కౌలు తీసుకుంటున్నట్లు సరైన ఆధారాలు చూపగలగాలి. అదే సమయంలో మరికొన్ని అర్హతలు కూడా లక్ష రూపాయల రుణాన్ని పొందేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
రుణాలు పొందడానికి అర్హతలివే...
ప్రాధమిక సహకార సంఘాల్లో రైతులకు సభ్యత్వం ఉండాలి. ఆ యా ప్రాధమిక సహకార సంఘాల పరిధిలోనే నివాసం ఉండాలి. చెల్లుబాటు అయ్యే కౌలు పత్రం ఉండాలి. కనీసం ఒక ఎకరం భూమి సాగులో ఉండాలని ప్రభుత్వం విధివిధానాల్లో నిర్ణయించింది. అలాగే గరిష్టంగా ఒక్కొక్క రైతుకు లక్ష రూపాయల రుణాన్ని అందించనున్నారు. ఈ లక్ష రూపాయల రుణాన్ని వ్యక్తిగతంగా లేదా సంఘంగా రుణాన్ని పొందవచ్చు. వడ్డీతో కలిసి తీసుకున్న రుణానని ఏడాదిలోపు చెల్లించాల్సి ఉంటుంది. అయితే డీకేటీ పట్టాలు, అసైన్డ్ భూముల్లో వ్యవసాయం చేసే వారికి మాత్రం ఈ పథకం వర్తించదు. అర్హతలున్న రైతులు తమ పరిధిలోని ప్రాధమిక సహకార సంఘాల్లో రుణం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Next Story

