Sat Dec 27 2025 08:41:57 GMT+0000 (Coordinated Universal Time)
ఉల్లి రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
ఉల్లి ధరల పతనంతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం నిధులు విడదల చేసింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ధరల పతనంతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఈ–క్రాప్ నమోదు చేసుకున్న ఉల్లి రైతులకు రూ.128.33 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. నష్టపోయిన రైతులకు క్వింటాల్‌కు రూ.20 చొప్పున సహాయం అందచేయాలని నిర్ణయించింది.కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలోని 37,752 మంది రైతులు లబ్ధి పొందనున్నారు.
క్వింటాల్ కు ఇరవై చొప్పు...
ఇటీవల ఉల్లి రైతులు గిట్టుబాటు ధర లభించక ఆవేదన చెందారు. సాగుకు అయ్యే ఖర్చు కూడా రాలేదని వారు ఆందోళనకు దిగారు. అనేక చోట్ల ఉల్లి ధరలు దారుణంగా పడిపోయాయి. దిగుమతులు పెరగడంతో పాటు దిగుబడులు కూడా ఎక్కువ కావడంతో ఉల్లి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో ప్రభుత్వం ఉల్లి రైతులను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంి.
Next Story

