Sat Dec 07 2024 23:26:39 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు దీక్షలు
ఆంధ్రప్రదేశ్ లో నేడు కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేయనున్నారు. గత మూడు రోజులుగా ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో నేడు కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేయనున్నారు. గత మూడు రోజులుగా ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. నిన్న అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలను సమర్పించారు. ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోను వెంటనే రద్దు చేయాలని, అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను బయటపెట్టాలంటూ వారు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.
7 నుంచి సమ్మెకు....
వచ్చే నెల 7వ తేదీ నుంచి ఉద్యోగులు సమ్మెకు వెళ్లనున్నారు. అయితే ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉద్యోగ సంఘాల నేతలు రిలే నిరాహార దీక్షలు చేయనున్నారు. ఈ రిలే నిరాహార దీక్షలు ఈ నెల 30వ తేదీ వరకూ జరగనున్నాయి.
Next Story