Fri Dec 05 2025 12:41:37 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపావళి వేళ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపావళి వేళ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు, పింఛన్లకు డీఏను పెంపును అమలులోకి తెస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. 2024 జనవరి 1వ తేదీ నుంచి 3.64 శాతం డీఏను అమలు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై పలు సమస్యలపై చర్చించారు.
వచ్చే నెలలో...
ఒక డీఏ నవంబరు నెలలో ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ మేరకు ఈరోజు ఆర్థిక కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త డీఏతో పాటు బకాయీలు కూడా త్వరలోనే విడుదల కానుండటంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకూ నాలుగు డీఏలు పెండింగ్ లో ఉండగా, ఒక డీఏను వచ్చే నెల ఒకటో తేదీన ఉద్యోగుల జీతాలతో పాటు ఇవ్వనున్నారు. ఇందుకు ప్రభుత్వంపై 160 కోట్ల భారం పడనుంది.
Next Story

