Fri Dec 05 2025 22:46:31 GMT+0000 (Coordinated Universal Time)
పునరాలోచిస్తాం... చర్చలకు రండి
ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరపడానికి సిద్ధంగా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు

ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరపడానికి సిద్ధంగా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. హెచ్ఆర్ఏ విషయంలో ప్రభుత్వం పునరాలోచిస్తుందని కూడా ఆయన తెలిపారు. ఉద్యోగులు ఆందోళనలను మాని ప్రభుత్వానికి సహకరించాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు. తమది ఎంప్లాయి ఫ్లెండ్లీ ప్రభుత్వమని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో ఒక భాగమేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
అర్థం చేసుకోండి...
అదే సమయంలో కరోనా కష్ట సమయంలోనూ ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని తెలిసినా ఐఆర్ కింద ఉద్యోగులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చిన సంగతి తెలియదా? అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలని, రాజకీయ నేతల్లా వ్యవహరించవద్దని శ్రీకాంత్ రెడ్డి కోరారు. ప్రభుత్వం ఎప్పుడూ మొండిగా పోదని, ఉద్యోగులందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు.
Next Story

