Puttaparthi : శతజయంతి వేడుకలకు ముస్తాబయిన పుట్టపర్తి
శ్రీసత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది

శ్రీసత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. అధికారికంగా ఈ శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తుండటంతో ఇప్పటికే పుట్టపర్తి వేడుకలకు ముస్తాబయింది. ఈ నెల 19న పుట్టపర్తికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, 22వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టపర్తికి రానున్నారు. ఈ నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రపతి సహా వివిధ ప్రముఖులు హాజరుకానున్న దృష్ట్యా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పుట్టపర్తికి ప్రముఖులు రానున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, పట్టణాన్ని సుందరంగా అలంకరించాలని సీఎం సూచించారు. ఏర్పాట్ల పర్యవేక్షించేందుకు మంత్రుల కమిటీ పుట్టపర్తిలో పర్యటించాలని ఆదేశించారు. శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందుకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు.

