Fri Dec 05 2025 18:24:40 GMT+0000 (Coordinated Universal Time)
రేపు కొత్త మంత్రుల జాబితా అధికారిక ప్రకటన
రేపు మధ్యాహ్నం కొత్త మంత్రుల జాబితాను అధికారికంగా ప్రకటిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

రేపు మధ్యాహ్నం కొత్త మంత్రుల జాబితాను అధికారికంగా ప్రకటిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అనంతరం సజ్జల మాట్లాడారు. కేబినెట్ కూర్పు ఇంకా కొనసాగుతుందన్నారు. రేపు మధ్యాహ్నం వరకూ కొత్త మంత్రివర్గంపై కసరత్తు కొనసాగుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. రేపు మధ్యాహ్నం తర్వాత అధికారికంగా కొత్త జాబితాను ప్రకటించే అవకాశముందని చెప్పారు.
బీసీలు, మహిళలు...
అయితే ఈ నెల 11వ తేదీన మంత్రి వర్గ విస్తరణ ఉండనుంది. ఇందుకు తగిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఉదయం 11.31 నిమిషాలకు మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం ఉంటుంది. జగన్ అన్ని అంశాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటారన్నారు. బీసీలు, మహిళలకు సముచిత స్థానం ఉంటుందని చెప్పారు. పాత కొత్త కలయికలతోనే కొత్త మంత్రివర్గం ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎవరినీ బుజ్జగించాల్సిన పని ఉండదని ఆయన చెప్పారు.
Next Story

