Thu Jan 29 2026 02:34:37 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబుది అబద్ధపు ప్రచారం
వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకం పూర్తిగా స్వచ్ఛంద పథకం అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకం పూర్తిగా స్వచ్ఛంద పథకం అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఓటీఎస్ పై ఎవరినీ బలవంతపెట్టడం లేదన్నారు. ఈ పథకంతో ప్రజలపై ఆరు వేల కోట్ల భారం పడకుండా చేస్తున్నామని చెప్పారు. ఈ పథకంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజల మేలుకోసమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టామని, ఇందుకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.
తాను అధికారంలో ఉండగా.....
చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన వచ్చిందా? అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. బాబు ఎప్పుడూ ప్రజల భారం తొలగిద్దామని ఆలోచించలేదన్నారు. నామమాత్రపు ఫీజుతో వారికి పూర్తి హక్కులు కల్పిస్తున్నామంటే చంద్రబాబుకు ఎందుకు అంత అసహనమని ఆయన నిలదీశారు. ఓటీఎస్ పథకంలో ఎవరూ చేరవద్దని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తామన్న చంద్రబాబు మాటలను ఎవరూ నమ్మరని ఆయన అన్నారు. చంద్రబాబు హామీలకు విలువ లేకుండా పోయిందని సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు.
Next Story

