Wed Jan 28 2026 22:07:43 GMT+0000 (Coordinated Universal Time)
మేం వెనకడుగు వేయం.. ఎవరు చెప్పినా అదే
తమ ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు

తమ ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కొందరు కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారరు. అమరావతిలో శాసన రాజధాని ఉంటుందన్నారు. కర్నూలుకు హైకోర్టుకు తరలి వెళ్లడం ఖాయమని సజ్జల చెప్పారు. పరిపాలనా వికేంద్రీకరణే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. కొందరు కావాలని అయోమయం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. రాజధాని అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని సజ్జల అభిప్రాయపడ్డారు.
మూడు ప్రాంతాల అభివృద్ధి...
మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి కూడా అదే అన్నారని, కాని కొందరు ఆయన వ్యాఖ్యలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఆయన ఏ సందర్బంలో ఆ వ్యాఖ్యలు చేశారో చూడాలని అన్నారు. ఎన్నికల కోసమే రాజకీయం చేసే పార్టీ తమది కాదని సజ్జల అన్నారు. సుప్రీంకోర్టులో తీర్పు ప్రకారమే తమ ప్రభుత్వం నడుచుకుంటుందన్నారు. తాము వెనకడుగు వేయమని ఆయన అన్నారు. విశాఖకు వెళతామంటే విపక్షాలకు ఎందుకంత కడుపు మంట అని ఆయన ప్రశ్నించారు.
Next Story

