Fri Dec 05 2025 11:41:43 GMT+0000 (Coordinated Universal Time)
వ్యక్తిగత జీవితం బయటపడకూడదనే మౌనంగా ఉన్నాం
వైఎస్ వివేకా హత్యపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైఎస్ వివేకా హత్యపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ కుటుంబంలోని ఒక నాయకుడి వ్యక్తిగత జీవితం బయటపడకూడదనే తాము ఇప్పటి వరకూ నిగ్రహం పాటించామని చెప్పారు. వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి మాట్లాడిన తర్వాత తాము కూడా మౌనం వీడక తప్పేట్లు లేదన్నారు. ఈ నాటకంలో వైఎస్ సునీత, ఆమె భతర్త పావులో, సహపాత్రధారులో తెలియడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
అప్రదిష్టపాలు చేయడానికి....
వైఎస్ కుటుంబాన్ని అప్రదిష్ట పాలు చేయడానికి ఒక వర్గం కుట్ర చేస్తుందని ఆయన అన్నారు. వ్యవస్థను అడ్డంపెట్టుకుని కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్ర జరుగుతోందన్న అనుమానం వ్యక్తమవుతుందన్నారు. ఈ నాటకానికి సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు అని అన్నారు. కేసు విచారణకు సంబంధించి చంద్రబాబు జగన్నాటకం ఆడిస్తున్నాడని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
Next Story

