Thu Jan 29 2026 01:11:13 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ పై సజ్జల సెటైర్లు ఇవే
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్ వేశారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్ వేశారు. టీడీపీ నేత వినోద్ జైన్ కారణంగానే విజయవాడలో బాలిక ఆత్మహత్య చేసుకుంటే పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. ఎందుకో ఏపీ ప్రజలకు బాగానే అర్థమయిందని సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు.
ఆ పదానికి అర్థం తెలుసా?
ఇక ప్రభుత్వం ఉద్యోగుల చర్చల్లో ఆధిపత్య ధోరణిని అవలంబించిందని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కూడా సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పదం బాగుందని పవన్ కల్యాణ్ వాడినట్లుందని, దానికి అర్థం ఆయనకు తెలుసా? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అమరావతి భూములను తాకట్టు మాత్రమే పెడుతుందని, టీడీపీ వాటిని అమ్మేయాలని నిర్ణయించిందని సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్ వేశారు.
Next Story

