Sun Dec 28 2025 07:35:25 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు పెద్ద సైకో : సజ్జల
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పెద్ద సైకో అని ఆయన అన్నారు. జనం ఎక్కడ ఉంటే అక్కడ చంద్రబాబు మీటింగ్ లు పెడుతున్నారన్నారు. వైసీపీ సభలకు జనం రావడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆయనతో పాటు ఆయన అనుకూల మీడియా చేస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మరని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
ట్రాఫిక్ ఎక్కడ ఉంటే...
చంద్రబాబు ట్రాఫిక్ ఎక్కడ ఉంటే అక్కడ మీటింగ్ లు పెడుతున్నారని, నిబంధలను ఉల్లంఘిస్తున్నామని తెలిసినా జనం కోసం సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. ప్రజలకు ఎవరు ఎంటో అన్నీ తెలుసునని అన్నారు. సైకో ఎవరో చంద్రబాబు మాటలను బట్టి చూస్తే అందరికీ అర్థమవుతుందన్నారు. అలాగే రాజకీయమంటే అరవై సీన్ల సినిమా కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.
Next Story

