Sun Dec 28 2025 05:48:11 GMT+0000 (Coordinated Universal Time)
డిమాండ్ పెంచుకోవడానికే బాబు యత్నం
చంద్రబాబు ఇప్పటికీ రెండు కళ్ల సిద్ధాంతాన్నే అవలంబిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికీ రెండు కళ్ల సిద్ధాంతాన్నే అవలంబిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఖమ్మంలో నిన్న పెట్టిన సభ ఆయన బీజేపీకి దగ్గరవ్వడానికేనని అనిపిస్తుందని అన్నారు. ఇంతకూ ఆయన ఏ రాష్ట్రంలో ఉంటారో తేల్చుకోవాలని సజ్జల రామకృష్ణా రెడ్డి కోరారు. ఎన్నికలు వస్తున్నాయంటే తెలంగాణకు వెళ్లడం అలవాటని, గత ఎన్నికల్లోనూ రాహుల్ గాంధీతో కలసి తిరిగారని సజ్జల గుర్తు చేశారు.
రెండు రాష్ట్రాల్లో రాజకీయాలు...
రెండు రాష్ట్రాల్లో రాజకీయాలు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారని, కానీ జగన్ మాత్రం ఆ విషయంలో ఎలాంటి ఇతర ఆలోచనలకు తావివ్వరని అన్నారు. రాజకీయంగా ఏదో ఒక ప్రయోగం చేసి తనకు తాను డిమాండ్ సృష్టించుకునేందుకే చంద్రబాబు ప్రయత్నమని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ లోని స్లీపర్ సెల్స్ ను ఆహ్వానించిన చంద్రబాబు ఏపీ బీజేపీలోని స్లీపర్ సెల్స్ ను ఎందుకు ఆహ్వానించడం లేదన్నారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయాలనుకుంటే మంచిదేనని, అక్కడే రాజకీయాలు చేసుకోవచ్చని సజ్జల అన్నారు.
Next Story

